శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 15 జులై 2021 (19:06 IST)

అర్థరాత్రి ఇంటికొచ్చే భర్తతో విసిగిపోయి పక్కింటి యువకుడితో లింక్, ఆ తర్వాత?

భర్త కన్నా ప్రియుడినే ఎక్కువగా నమ్మింది. అతనే సర్వస్వమనుకుంది. భర్త దగ్గర కన్నా ప్రియుడి దగ్గరకు వెళ్ళిపోవడమే మంచిది అనుకుంది. నువ్వే నా జీవితమని ప్రియుడికి చెప్పింది. కానీ వివాహితను వాడుకుని వదిలేద్దామనుకున్న ఆ దుర్బిద్ధి ఉన్న ప్రియుడి అసలు స్వరూపాన్ని గ్రహించలేకపోయింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. 
 
ఒడిశా రాజధాని భువనేశ్వర్ పరిధిలోని భీమతంగిలో రాకేష్ సాహు, ప్రియాంకలు నివాసముంటున్నారు. వీరికి మూడేళ్ళ బాబు కూడా ఉన్నాడు. భువనేశ్వర్ లోని భీమతంగి హౌసింగ్ బోర్డ్ కాలనీలో వీరు ప్రస్తుతం నివాసముంటున్నారు. రాకేష్ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంచి జీతం.
 
ఐతే ఉదయం వెళితే రాత్రికి రాకేష్ ఇంటికి వచ్చేవాడు. విధుల్లో బిజీగా ఉండేవాడు రాకేష్. దీంతో భార్య ప్రియాంక, భర్త విషయంలో బాగా విసిగిపోయింది. ఈ తరుణంలో ఇంటకి దగ్గరలో జగన్నాథ్ అనే 30 యేళ్ళ యువకుడు ప్రియాంక కూరగాయల కోసం మార్కెట్‌కు వచ్చే సమయంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
 
ఆ పరిచయం ఇద్దరిని బాగా దగ్గర చేసింది. వివాహేతర సంబంధానికి కారణమైంది. ఇంట్లో మూడేళ్ళ బాబు ఉండగానే ప్రియుడితో ఎంజాయ్ చేసింది ప్రియాంక. అయితే ప్రియుడితో జరుగుతున్న తతంగాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చింది. ప్రియుడితో జరుగుతున్న చాటింగ్‌లను కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ జాగ్రత్తపడుతూ ఉండేది. 
 
అయితే భర్త కన్నా ప్రియుడే సర్వస్వమనుకున్న ఆమె తనను ఎక్కడికైనా తీసుకెళ్ళాలని కోరింది. బాబును కూడా తీసుకొచ్చేస్తాను నన్ను బయటకు తీసుకెళ్లిపో. నీతోనే నా జీవితమంది ప్రియాంక. దీంతో ప్రియుడు జగన్నాథ్ కంగుతిన్నాడు. టైంపాస్ కోసం వివాహితను వాడుకుని వదిలేద్దామనుకుంటే సీన్ రివర్స్ అయ్యేలా ఉందని భావించాడు. దాంతో ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు.
 
ఎప్పటిలాగే ఇంటికి వచ్చిన జగన్నాథ్ ప్రియాంకతో ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తరువాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మూడేళ్ళ బాబును చంపేద్దామనుకుని వెతికాడు. కానీ ప్రియాంక, తన ప్రియుడు ఇంటికి రాకముందే ఆ బిడ్డను పక్కంటిలో ఇవ్వడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
ఇంటికి వచ్చిన భర్త తన భార్య అతి దారుణంగా హత్య చేయబడిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేసిన పోలీసులకు అతడి భార్య వివాహేతర సంబంధం కారణంగా హత్య చేయబడిందని కనుగొన్నారు. సెల్ ఫోన్ సంభాషణలు బయటకు లాగడంతో నిందితుడిని చాలా సులభంగా పట్టేసారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.