దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో దేవినేని రమణ స్థానం సుస్థిరం- దేవినేని ఉమా
దివంగత తెలుగుదేశంపార్టీ నాయకుడు మాజీ మంత్రి శ్రీ దేవినేని వెంకటరమణ 22వ వర్ధంతి ని పురస్కరించుకుని ఆయన సోదరుడు మాజీ మంత్రి శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ తన నిరుపమాన సేవలతో దేవినేని రమణ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నాడని 22 సంవత్సరాలు గడిచినా ఆయన పట్ల ప్రజల ఆదరణలో ప్రేమ ఆప్యాయతలలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం కరోనా మహమ్మారి బారినపడి అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు స్థానిక నేతలతో కలిసి నివాళులు అర్పించారు.