ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (11:49 IST)

వివేకా హత్య కేసు విచార‌ణ‌; దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ నేత వై.ఎస్. వివేకానంద రెడ్డి హ‌త్య కేసును సీబీఐ చాలా లోతుగా విచారిస్తోంది. ఇందులో భాగంగా సీబీఐ హైదరాబాద్‌లో నిన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని హాజరుపరిచారు. అనంత‌రం ట్రాన్సిట్ వారెంట్‌పై శివ శంకర్ రెడ్డిని కడపకు తరలించారు. 

 
 
ఈ ఉదయం 10 గంటలకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు కడపకు తీసుకువ‌చ్చారు. నిందితుడిని ఈ మధ్యాహ్నంలోపు పులివెందుల కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, త‌నకు ఆరోగ్యం బాగోలేద‌ని, వివేకా హ‌త్య‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, న్యాయం చేయాలని కోరుతూ, సీబీఐకి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి లేఖ రాశాడు.

 
మరో ప‌క్క త‌న తండ్రికి వివేకా హత్యకేసులో ఎలాంటి సంబంధం లేద‌ని, ఆయ‌న కుమారుడు డి.చైతన్యరెడ్డి చెపుతున్నాడు. కేవలం ఆరోపణతోనే త‌న తండ్రిని అరెస్టు చేశార‌ని, ఈ నెల 15న త‌న  తండ్రి ఎడమ భుజానికి సర్జరీ జరిగింద‌ని చెప్పాడు. ఇంకా వైద్య చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంద‌ని, అనారోగ్యంతో ఉన్నందున త‌న తండ్రిని విడిచిపెట్టాల‌ని, త‌గిన న్యాయం చేయాలని సీబీఐకి  దేవిరెడ్డి చైతన్యరెడ్డి విజ్ణ్న‌ప్తి చేశాడు.