ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (12:03 IST)

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

car accident
ఏలూరులో ఓ విషాదం చోటుచేసుకుంది. కారు ఒకటి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మొత్తం 10 మంది విద్యార్థులు రెండు కార్లలో విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, బూరుగుపూడి సమీపంలో కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని రామచంద్రా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి గడిపి, తిరిగి మళ్లీ బయలుదేరారు. 
 
అర్థరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలో ఓ కారు అదుపుతప్ప పాత కొత్త వంతెనల మధ్య కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్, హర్షవర్థన్, హేమంత్ అనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.