Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఏపీ శాసనమండలిలో మారనున్న సమీకరణాలు

Written By ఎం
Updated: గురువారం, 17 జూన్ 2021 (23:04 IST)
రేపు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సమీకరణాలు మారనున్నాయి. మండలిలో రేపటి నుంచి ఆధిక్యంలోకి వైఎస్సార్‌సీపీ రానుంది. రేపు మండలి నుంచి ఏడుగురు టీడీపీ సభ్యులు రిటైర్‌ కానున్నారు.

మండలిలో 22 నుంచి 15కు  టీడీపీ బలం పడిపోనుంది. గవర్నర్‌ కోటాలో తాజాగా నలుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే.  మండలిలో 17 నుంచి 20కు  వైఎస్సార్‌సీపీ బలం పెరగనుంది. రేపు వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి రిటైర్‌ కానున్నారు.
 
గవర్నర్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన సంగతి విదితమే.

దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్‌ (వైఎస్సార్‌ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు.

మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments