ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తురాలు కరీమున్నిసా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తురాలు కరీమున్నిసా అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. గురువారం బందర్ రోడ్డ లోని ఓ హోటల్లో ముస్లిం జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మెల్సి కరీమున్నిసా సంతాప సభను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.
ఎమ్మెల్సీ కరీమున్నీసా కుటుంబానికి తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని అన్నారు.పార్టీలో కార్యకర్త నుండి కార్పొరేటర్ నుండి ఎమ్మెల్సీ గా ఎదిగిన మహిళ కరీమున్నీసా అని అన్నారు. వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన వ్యక్తి గా ఆమె ఉండటం జరిగిందనీ అన్నారు.మైనారిటీ సమస్యల పై నిరంతరం పోరాడరానీ తెలిపారు. ఆమె ఆత్మశాంతి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నామనీ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఎండీ రుహుల్లా విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు.
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎమ్మెల్సీ పదవిని ఎండీ రుహుల్లాకి కేటాయించడం శుభపరిణామని తెలిపారు.అనంతరం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కరీమున్నీసా సామాన్య కార్యకర్త నుండి పార్టీకి నిస్వార్దం గా సేవలు అందించారని తెలిపారు. సెంట్రల్ ఏమ్మెల్యే ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, పార్టీకి ఆవిర్భావ నుంచి నిస్వార్దంగా సేవలు అందించారని తెలిపారు. ఒక్క అమ్మలాగా అందరిని ఆప్యాయంగా పలకరించే నిస్వార్థమైన మనసత్వం కలిగిన వ్యక్తిన్నారు. ఆమె మరణం ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.
అనంతరం పీపుల్ వాయిస్ నాగుర్ మాట్లాడుతూ, కరోనా కష్ట కాలంలో అందరినీ ఆదుకున్నారని అన్నారు. బ్యారెజ్ వద్ద లంగర్ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు.ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టు అలీముద్దీన్ నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, ఉర్దూ ఆకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.