సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2024 (16:00 IST)

సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు

rk roja
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి రోజా శనివారం తన నామినేషన్ పత్రాలను ఈసీకి సమర్పించారు. ఇందులో తన ఆస్తి వివరాలను తెలియజేసారు. 2019 ఎన్నికల సమయంలో రోజా ఆస్తులు రూ. 9.03 కోట్లు వుండగా ఇప్పుడు అవి రూ. 13.07 కోట్లకి పెరిగినట్లు ఆమె వెల్లడించారు.
 
ఈ ఆస్తుల్లో రూ. 5.09 కోట్లు చరాస్తున్నట్లు చూపించారు. రూ. 7.08 కోట్లు స్థిరాస్తులు వున్నట్లు పేర్కొన్నారు. కోటి రూపాయలు విలువైన బెంజ్ కారుతో పాటు 9 కార్లు వున్నట్లు ఆమె తెలియజేసారు. చదువు విషయానికి వస్తే తను చదివింది కేవలం ఇంటర్మీడియెట్ వరకేనని ఆమె తన అఫిడవిట్లో వెల్లడించారు.