ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (12:38 IST)

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు : కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు

fire
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే రైలులోనే కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో రైలును ఆపేసి మంటలను అదుపు చేశారు. దాదాపు గంట సేపు రైలు గూడూరు రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. 
 
అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న సమయంలో రైలులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కిటికీల ద్వారా పొగ బయటికి రావడంతో ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ యాక్టివేట్ అయిందని తెలిపారు.