బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 31 మార్చి 2017 (19:32 IST)

వాళ్లకు రెడ్ లైట్ పెట్టాల్సిందే... అసెంబ్లీలో చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంకు మెట్లు పెట్టి అంత ఎత్తున నిర్మించినా, నిరసనలు తెలుపుతూ నేరుగా స్పీకర్ దాకా వెళ్లడాన

అసెంబ్లీ సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంకు మెట్లు పెట్టి అంత ఎత్తున నిర్మించినా, నిరసనలు తెలుపుతూ నేరుగా స్పీకర్ దాకా వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. " అధ్యక్షా... వీళ్లకు క్రమశిక్షణ లేదు. వీరికి రెడ్ లైట్ పెట్టాల్సిందే. స్పీకర్ స్థానం మెట్లు వద్ద రెడ్ లైట్ పెట్టి ఆ లైటు దాటి వస్తే వారిపై చర్యలు తీసుకునేట్లు చేయాలి. 
 
ఈ సమావేశాల్లో కనీసం ఒక బిల్లుపై చర్చకు వచ్చారా. 9 గంటలకు ఒక్కసారి కూడా ప్రశ్నోత్తరాలు జరుగనిచ్చారా? వీరిని క్రమశిక్షలో పెట్టాల్సిందే. వీరికి శిక్షణా తరగతులు పెట్టండి. తరగతుల్లో అన్నీ వీరికి చెప్పాలి. అప్పటికీ లైన్ దాటితే వేటు వేయాల్సిందే. వీరిలో జిల్లా ఎమ్మెల్యేలున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల కష్టాలు పట్టవా. ప్రజల కష్టాలు చెప్పరా" అంటూ ప్రశ్నించారు.