మంత్రి పదవి నాకు ఈకముక్కతో సమానం, సీఎం పదవి ఇస్తారా?: కొడాలి నాని
మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి పదవి తనకు ఈక ముక్కతో సమానమన్నారు. తనకు సీఎం పదవి ఇస్తారా... ఇవ్వరు కదా అంటూ మీడియాతో అన్నారు.
తను మంత్రి పదవుల కోసం రాలేదనీ, జగన్ గారి వెన్నంటి నడిచే సైనికుడిగా వుండేందుకు వచ్చానన్నారు. పదవి నుంచి తప్పించారంటే.. ఆయన తన మనిషి అని అనుకోబట్టే ఆ పని చేసారన్నారు. జగన్ నిర్ణయం వెనుక ఎంతో ఆలోచన వుంటుందనీ, ఎన్టీఆర్ తర్వాత అంతటి విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోగలుగుతున్నది జగన్ అని ప్రశంసించారు.
మంత్రి పదవి కోసం మామనే వెన్నుపోటు పొడిచేటటువంటి చంద్రబాబు లాంటి సంస్కృతి తమది కాదన్నారు. ఎన్నాళ్లయినా జగన్ గారితోనే వుంటామన్నారు. చంద్రబాబు లాంటి నీచుడు పదవుల కోసం, ఎంగిలి మెతుకుల కోసం తిరుగుతారంటూ బాబుపై మండిపడ్డారు.