ఏపీ మంత్రివర్గం నుంచి ముగ్గురు నానిలు ఔట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ముగ్గురు నానిలు నిష్క్రమించారు. మంత్రులుగా ఈ ముగ్గురు నానిలను తొలగించేశారు. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో ఏకంగా ముగ్గురు నానిలకు ఆయన చోటు కల్పించారు. వీరిలో పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ళ నానిలు ఉన్నారు. అయితే, తాజాగా చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో మాత్రం ఈ ముగ్గురుని తొలగించారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నానికి మాత్రం కొంత ఊరట లభించింది. ఈయనకు కీలక పదవిని సీఎం జగన్ కట్టబెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసే స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొడాలి నానికి కేబినెట్ హోదా కల్పించి నియమించనున్నారు. దీంతో ఆయనకు మంత్రిపదవి పోయినప్పటికీ కేబినెట్ హోదాలో ప్రభుత్వం కల్పించే సకల సదుపాయాలు పొందనున్నారు.