మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (07:35 IST)

కొత్త మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం నిల్!

apmap
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన కొత్త మంత్రివర్గం జాబితాను ప్రకటిచారు. ఇందులో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కలేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. కానీ, తన మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సివుంది. కానీ, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించలేదు. 
 
ఈ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇద్దరికి, ముగ్గురికి కూడా చోటు కల్పించిన జగన్.. ఈ ఎనిమిది జిల్లాలకు మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ముగ్గురికి చోటు కల్పించారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజాలు ఉన్నారు. 
 
అలాగే, శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో ఉన్నారు. విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటిచ్చారు.