గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (18:51 IST)

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి

గద్వాల జిల్లాలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారుల మృతి చెందారు. తెలంగాణలోని గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద చిన్నారులు కృష్ణా నదిలో ఈతకు దిగారు. 
 
లోతు ఎక్కువగా వుండటంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిని అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7)అని గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 
 
నదిలో దిగిన చిన్నారులకు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు.