మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (12:23 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణాలు హరిస్తున్న రహదారులు

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నట్టు విపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటికి మరింత బలం చేకూర్చేలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద అర్థరాత్రి కారు ఇంటిని ఢీకొనడంతో కుప్పంకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
మరోవైపు, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం వద్ద లారీ, బొలేరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ రెండు ప్రమాదాల్లో ఆయా జిల్లాల పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.