Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో సగం ఛార్జీ అదనం: ఏపీఎస్‌ఆర్టీసీ

Written By ఎం
Updated: గురువారం, 31 డిశెంబరు 2020 (20:02 IST)
‘ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు నిత్యం మరో 48 వేల కి.మీ. మేర సర్వీసులు నడిపేలా చర్చలు జరిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు.

ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘కరోనా వల్ల ఇప్పటి వరకు సంస్థ రూ.2,603 కోట్ల మేర రాబడి కోల్పోయింది. ఈ ఏడాది సగటు ఓఆర్‌ 59.14 శాతమే ఉంది. డిసెంబరులో ఓఆర్‌ 70.74 శాతానికి పెరిగింది. మార్చినాటికి సాధారణ పరిస్థితి వస్తుంది...’ అని వివరించారు.

సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు.

* 5,586 మంది ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడగా.. 91 మంది మరణించారు. వీరికి కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన పంపాం.

* ఉద్యోగులు ప్రజారవాణాశాఖలో విలీనమైనప్పటికీ, కేడర్ల కేటాయింపు, పేస్కేల్‌ ఖరారు కోసం వివరాలు పీఆర్సీకి అందజేశాం.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments