శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (08:06 IST)

నష్టాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ

కరోనా ప్రభావం పైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) పడింది. ఏపీఎస్‌ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వంలో ఉద్యోగులను విలీనం చేసింది.

వేతనాలు, అలవెన్సుల భారం నుంచి బయటపడి సంస్థను పరిపుష్టి చేసుకునేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ‘కరోనా’ రూపంలో మరో ఉపద్రవం వచ్చి పడింది.

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాకౌట్‌ ప్రకటించడంతో ఆర్టీసీ సర్వీసులను మార్చి 31వ తేదీ వరకు నిలిపేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆర్థికంగా నష్టం జరుగు తున్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సర్వీసులను నిలిపివేయక తప్పని స్థితి నెలకొంది.

ఆర్టీసీ సంస్థకు రోజుకు సగటున రూ.3కోట్ల మేర టిక్కెట్ల రూపంలో ఆదాయం వస్తుంది. పది రోజుల పాటు సర్వీసుల నిలుపు దలతో రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. పరి స్థితి ఇదే విధంగా కొనసాగితే మరికొన్ని రోజులు ఆర్టీసీ సర్వీసులను ఆపక తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.