కరోనా ముప్పు తొలగిన నాడే నిజమైన ఉగాది: పవన్ కల్యాణ్

pawan
ఎం| Last Updated: మంగళవారం, 24 మార్చి 2020 (21:02 IST)
తెలుగు ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు ఉగాదిని పురస్కరించుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సోదర, సోదరీమణులందరికీ శార్వరీ నామ ఉగాది శుభాకాంక్షలు అంటూ సందేశం వెలువరించారు.

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కారణంగా వణికిపోతున్న తరుణంలో శార్వరీ నామ ఉగాది వస్తోందని, ఈ కొత్త సంవత్సరం ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరికీ మేలు చేయాలని, సంపూర్ణ ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఈసారి ఉగాది వేడుకలను ఇంటి వరకే పరిమితం చేసుకుందామని, ఇంట్లో ఉన్న వస్తువులతోనే పండుగ జరుపుకుందాం అని పవన్ కల్యాణ్ సూచించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా ముప్పు తొలగిననాడే నిజమైన ఉగాది అని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరం ప్రభుత్వ సూచనలు పాటించి, సమష్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు.
దీనిపై మరింత చదవండి :