1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (19:55 IST)

జస్టిస్ రాకేష్ కుమార్ సేవలు శ్లాఘనీయం: చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తన పదవీ కాలంలో ఎన్నో ఉన్నతమైన తీర్పులు ఇచ్చారని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి కొనియాడారు.

జస్టిస్ రాకేష్ కుమార్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టులో నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో జస్టిస్ రాకేష్ కుమార్ కు జ్ఞాపికను అందజేసి, దుశ్శాలువాతో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సత్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్ కుమార్ సేవలను కొనియాడారు. భావితరాలకు ఆయనిచ్చిన తీర్పులు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ అనంతర జీవితం ఆనందమయం కావాలని ఆకాక్షించారు.

క్రీడాకారుడిని కావాలనుకుని న్యాయ వ్యవస్థలోకి వచ్చానని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తెలిపారు. న్యాయమూర్తిగా అందించిన సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. తన పదవీ కాలంలో సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, న్యాయవాదులకు, తోటి న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు పదవీ విమరణ చేస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ కు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు అభినందనలు తెలియజేశారు.

చివరగా ‘ఫేర్ వెల్ బై పుషింగ్ ద కార్’ కార్యక్రమంతో జస్టిస్ రాకేష్ కుమార్ కు ఘన వీడ్కోలు పలికారు, ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.