మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (14:44 IST)

తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు.. నేలరాలిన మామిడి

Rains
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున వర్షం దంచి కొట్టింది. జగిత్యాల జిల్లాలో మామిడి నేల రాలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఈ వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి వరి ధాన్యం తడవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
ఇకపోతే.. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
 
నేడు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అదే సమయంలో గరిష్ఠంగా 40 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.