Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వాట్సాప్‌లో విటుని ఫోటో చూశాకే ఓకే చెబుతున్న వ్యభిచారిణిలు...

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యభిచారిణిలు కూడా బాగా వాడేసుకుంటున్నారు. వ్యభిచారం చేసేందుకు తమ వద్దకు వచ్చే విటుల్లో తెలిసిన వారు ఉంటే తమ పరువు పోతుందని భావించిన అమ్మాయిలు, ఆంటీలు.

Written By pnr
Updated: మంగళవారం, 7 ఆగస్టు 2018 (12:50 IST)
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యభిచారిణిలు కూడా బాగా వాడేసుకుంటున్నారు. వ్యభిచారం చేసేందుకు తమ వద్దకు వచ్చే విటుల్లో తెలిసిన వారు ఉంటే తమ పరువు పోతుందని భావించిన అమ్మాయిలు, ఆంటీలు... ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా తొలుత విటుల ఫోటోలను వాట్సాప్‌లో పంపించమని కోరుతున్నారు. ఆ విటుడు నచ్చితేనే అతనికి పడకసుఖం అందించేందుకు వ్యభిచారిణిని సమ్మతిస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలో వెలుగు చూసింది.
 
జయశంకర్‌ జిల్లాలో హైటెక్‌ వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా గృహాలను అడ్డాగా చేసుకొని ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వ్యభిచార బ్రోకర్లు మాత్రమే కాదు... వ్యభిచారిణిలు కూడా హైటెక్ టెక్నాలజీని వాడుతున్నారు. పేదరికంతో కొందరు వ్యభిచార కూపంలోకి దిగుతుంటే.. మరికొందరు మరింత విలాసవంతమైన జీవితం కోసం ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. ఇందుకోసం తమ నివాసాలనే సురక్షితమైన అడ్డాగా ఎంచుకుంటున్నారు. 
 
అదేసమయంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళలు విటులను చూసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తెలిసిన వారుంటే పరువు పోతుందనే భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత వాట్స్‌ప్‌లో విటుని చిత్రాన్ని పంపించాలని కోరుతున్నారు. అలా పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ముందడుగు వేస్తున్నారు. 
 
పైగా, వ్యభిచారం జరుగుతున్నట్లు ఎవరికీ అనుమానం రాకుండా నిర్వాహకులు కొన్ని గృహాలనే అడ్డాలుగా మార్చుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీ, శాంతినగర్‌, జవహర్‌నగర్‌కాలనీ, బాంబులగడ్డ తదితర ప్రాంతాల్లో ఈ దందా నడుస్తున్నట్లు వార్తలు రావడంతో పోలీసులు దృష్టిసారించారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments