శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (11:31 IST)

మైనర్ బాలికలతో శృంగారం... విటుడుగా వెళ్ళిన పోలీస్ ఆఫీసర్

పోలీసు అధికారి విటుడిగా వెళ్లి...సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో బహిర్గతమైన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పాన్పూర్ గ్రామంలో వ్యభిచార దందా సాగుతు

పోలీసు అధికారి విటుడిగా వెళ్లి...సెక్స్ రాకెట్ గుట్టు రట్టుచేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో బహిర్గతమైన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పాన్పూర్ గ్రామంలో వ్యభిచార దందా సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో ఓ పోలీసు ఉన్నతాధికారిని విటుడు వేషంలో ఆ గ్రామానికి పంపించారు పోలీసు ఉన్నతాధికారులు.
 
ఈ గ్రామంలో ఓ ఘరానా ముఠా మైనర్ బాలికలతోపాటు యువతులను తీసుకువచ్చి వారితో గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం పోలీసు బృందాన్ని రప్పించి సెక్స్ రాకెట్ నిర్వాహకులు, విటులను అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్ బాలికలతో పాటు ఏడుగురు యువతులను వ్యభిచారం రొంపి నుంచి రక్షించారు. నిందితులపై పీటీ, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.