శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:28 IST)

కార్పోరేట‌ర్ తిరుమ‌ల్ రెడ్డి రోడ్డు‌పై చిందులు... (వీడియో)

రోడ్డు‌పై ఎవ‌రైనా చిందులు వేసి హ‌ల్ చ‌ల్ చేస్తే... తాగేసి మందుబాబులు... అలా చేస్తుంటారు అది కామ‌నే అనుకోవ‌చ్చు. అలాగే బాధ్య‌త లేని కుర్రాళ్లు ఇలా చేస్తుంటారు కానీ... బాధ్య‌త గ‌ల కార్పోరేట‌ర్ రోడ్డు‌పై

రోడ్డు‌పై ఎవ‌రైనా చిందులు వేసి హ‌ల్ చ‌ల్ చేస్తే... తాగేసి మందుబాబులు... అలా చేస్తుంటారు అది కామ‌నే అనుకోవ‌చ్చు. అలాగే బాధ్య‌త లేని కుర్రాళ్లు ఇలా చేస్తుంటారు కానీ... బాధ్య‌త గ‌ల కార్పోరేట‌ర్ రోడ్డు‌పై అది కూడా హైవే రోడ్డు‌పై కారు ఆపేసి త‌న వాళ్ల‌తో క‌లిసి చిందులు వేస్తే ఏమ‌నాలి. ఇదంతా ఎక్క‌డ అనుకుంటున్నారా..? ఎవ‌రా కార్పోరేట‌ర్ అనుకుంటున్నారా..? 
 
హయత్ నగర్ కార్పోరేటర్ సామ తిరుమల్ రెడ్డి. శ్రీశైలం వెళుతూ తనతో పాటు నలుగురు జీహె‌ఎంపీ సానిటరి ఫీల్డ్ అసిస్టెంట్‌లను తోడుగా తీసుకుని వెళ్లాడు. అక్క‌డవ‌ర‌కు బాగానే ఉంది.  వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో చిందేసి ఓ స్టెప్ వేయాల‌నుకున్నాడ‌నుకుంట‌. ఇంకేముంది ప‌క్క నుంచి వాహనాలు వస్తున్నా స‌రే... ప‌ట్టించుకోకుండా రోడ్డుపై చిందులు వేసి హ‌ల్ చ‌ల్ చేశాడు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.