బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 12 అక్టోబరు 2017 (21:13 IST)

అమిత్ షాకు పాద పూజ చేస్తా... సిపిఐ నేత నారాయణ (వీడియో)

ఎప్పుడూ వార్తల్లో నిలిచే సిపిఐ నేత నారాయణ మరోసారి బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పాలన మొత్తం అవినీతిమయమేనని విమర్శించారు. బిజెపి నేతలంతా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారాయన. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామ

ఎప్పుడూ వార్తల్లో నిలిచే సిపిఐ నేత నారాయణ మరోసారి బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ పాలన మొత్తం అవినీతిమయమేనని విమర్శించారు. బిజెపి నేతలంతా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారాయన. అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని మోడీ మాటలు చెప్పడం తప్ప, అది సాధ్యం కావడం లేదన్నారు. అమిత్ షా కుమారుడు సంవత్సరంలో కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ప్రజలందరూ కోట్లు సంపాదించేందుకు అమిత్ షా సహకరిస్తే ఆయనకు పాదపూజ చేస్తానని చెప్పారు నారాయణ. తమను ప్రశ్నించే వారే ఉండకూడదంటూ కేరళ, మమతా బెనర్జీలపై కేంద్రం దాడులు చేయిస్తోందని ఆరోపించారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ, సిపిఎం కార్యదర్శులు శ్రీకాకుళంలో ఆందోళన చేపడితే వారిని అరెస్టు చేసి ఇచ్ఛాపురం జైలుకు తరలించడాన్ని తప్పుబట్టారు నారాయణ. వెంటనే సిపిఐ నేత రామక్రిష్ణ, సిపిఎం నేత మధులను విడుదల చేయాలని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. వీడియో చూడండి.