మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:15 IST)

నెల్లూరులో SPB ఘనమైన జ్ఞాపకం ఏర్పుటుకు సీఎం జగన్‌ను అభ్యర్థిస్తా: మంత్రి అనిల్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్య క్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీబీ భౌతిక కాయానికి నివాళులర్పించిన అనిల్, అనంతరం ఎస్పీ కుమారుడు చరణ్‌ను ఓదార్చారు.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బాలుగారు లేని లోటు ఎవరూ పూడ్చలేరని, నెల్లూరులో గాన గంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తానని చెప్పారు.
 
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు కూడా ఎస్పీ బాలు పార్థీవ దేహానికి నివాళులు అర్పంచిన వారిలో ఉన్నారు.