ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. సిసోడియాకు రెవెన్యూ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి.అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, సీసీఎల్ చీఫ్ కమిషనర్ గా జి.జయలక్ష్మి, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శిగా సురేశ్ కుమార్‌లను బదిలీ చేశారు.
సురేశ్ కుమార్‌కు గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా కూడా సురేశ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా హర్షవర్ధన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యదర్శిగా పి.భాస్కర్‌లను బదిలీ చేశారు. పి.భాస్కర్‌కు ఈడబ్ల్యుూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించారు.
సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా కె.కన్నబాబును బదిలీ చేశారు. ఆయనకు గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ను బాధ్యతలు అప్పగించారు. వినయ్ చంద్‌ను పర్యాటక శాఖ కార్యదర్శిగా, వివేక్ యాదవ్‌ను యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా, సూర్యకుమారిని మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా, సి.శ్రీధర్‌ను ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.