గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 7 సెప్టెంబరు 2017 (12:32 IST)

దారుణం... అక్కడ ఇంజక్షన్ వేసి భర్తను చంపేసింది.. ఎందుకో తెలుసా..?!

వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేస్తున్నారు కొంతమంది భార్యలు. కొంతమంది అయితే భర్తను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. అలాంటి సంఘటనే పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. గత నెల 23వ తేదీన దేవరపల్లి సమీపంలోని గౌరీపట్నంలో ఉన్న నిర్మల

వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేస్తున్నారు కొంతమంది భార్యలు. కొంతమంది అయితే భర్తను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. అలాంటి సంఘటనే పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. గత నెల 23వ తేదీన దేవరపల్లి సమీపంలోని గౌరీపట్నంలో ఉన్న నిర్మలగిరి క్షేత్రంలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. శరీరంలో ఎలాంటి గాయం లేకుండా మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. పోస్టుమార్టంలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. 
 
ఆ వ్యక్తికి అక్కడ హైపవర్ డ్రగ్ ఇంజక్షన్ ఇచ్చినట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఎవరా వ్యక్తి అని పోలీసులు విచారిస్తే భీమశంకరగా గుర్తించారు. పోలీసులు లోతుగా విచారిస్తే ఆయన మృతికి భార్యే కారణమని తేలింది. భీమ శంకర భార్య జయలక్ష్మి నర్సుగా పనిచేస్తోంది. ఈమె పనిచేస్తున్న ఆసుపత్రిలోనే సహోద్యోగి వీరేష్‌‌తో ఈమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. 
 
ఇది కాస్తా భర్తకు తెలిసి మందలించాడు. దీంతో ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలని ఇంటిలో నిద్రిస్తున్న భర్తకు పురుషాంగంపై విషపు ఇంజక్షన్ వేసింది. అతను మరణించాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీరేష్‌ను పిలిచి ఇద్దరూ కలిసి మృతదేహాన్ని నిర్మలగిరి క్షేత్రంలో పడేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.