రెండు వాహనాల నిండా అక్రమ మద్యం.. ఎక్కడ?

శనివారం, 7 నవంబరు 2020 (08:48 IST)
కర్ణాటక నుండీ అక్రమమద్యాన్ని రెండుకార్లలో తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని  కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో చోటుచేసుకుంది.

ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి రిశాంత్ రెడ్డి ఇక్కడి సిఐ రామకృష్ణమాచారి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి లతో కలిసి ఆయన మాట్లాడుతూ..మండలంలోని గుండ్రాపల్లె  వద్ద ఎస్ఐ తనసిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరుపతికి చెందిన హుస్సేన్ బాషా,భార్గవ్ లు రెండు వాహనాలలో సుమారు 6లక్షల రూపాయల విలువైన మద్యాన్ని తీసుకుని వస్తుండగా స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఇందులో మద్యం తరలిస్తున్న నిందితులు  చాలా వరకు యువతే ఉండటం చాలా విచారంగా వుందన్నారు. చిన్న వయసులోనే ఇటువంటి నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అధికారులతో బాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments