కోర్టుల చుట్టూ తిరగటమే అభివృద్దా?: వైసీపీకి సీపీఐ సూటి ప్రశ్న
65 అంశాలను వివాదాస్పదం చేసి కోర్టుల చుట్టూ తిరగటమే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్దా? అని సీపీఐ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఏడాది పాలనలో ఏ రంగంలో అభివృద్ధి సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఏ రంగంలో అభివృద్ధి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
ఈ ఏడాది కాలంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు నిలిచిపోవటం నిజం కాదా?, 65 అంశాలను వివాదాస్పదం చేసి కోర్టుల చుట్టూ తిరగటమే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్దా?, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆన్‌లైన్ రమ్మీ ఆటలపై నిషేధం విధించాలని కోరుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డికీ, తుంగభద్ర వరద కాలువ నిర్మాణానికై చర్యలు వేగవంతం చెయ్యాలని మంత్రి పీ అనిల్‌కుమార్‌కు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.