మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 21 జులై 2020 (22:16 IST)

అలా చేస్తానని తండ్రికి చెప్పిన నారా లోకేష్, చంద్రబాబు ఏమన్నారు?

అసలే తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం. అసలు ప్రతిపక్ష పార్టీ నేతలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారా అన్న అనుమానం అందరిలోను కలుగుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడి వారు అక్కడే సైలెంట్. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అడపాదడపా బయటకు వచ్చి కరోనా కాలంలో నిరసనలు చేస్తూ పార్టీని బతికించుకుంటున్నారన్న ప్రచారం బాగానే ఉంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి. తెలుగుదేశంపార్టీకి పునర్ వైభవం తీసుకురావాలన్నది తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ కార్యదర్సి నారా లోకేష్ ల ఆలోచన. అందుకే నారా లోకేష్ ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్ళబోతున్నారట. 
 
సైకిల్ యాత్రకు లోకేష్‌ సిద్థమయ్యారట. ఇప్పటికే 13జిల్లాలలో ఏ విధంగా పర్యటించాలో ఒక షెడ్యూల్ ను సిద్థం చేసుకుని మరీ తండ్రి చంద్రబాబు ముందు ఉంచారట. అయితే ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో డిసెంబర్ నుంచి తన సైకిల్ యాత్రను ప్రారంభించాలని లోకేష్ నిర్ణయానికి వచ్చేశారట.
 
ఇదే విషయాన్ని కార్యకర్తల దృష్టికి తీసుకెళితే అందరూ ఎంతో సంతోషంతో ఒకే చేసేశారట. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచే తన సైకిల్ యాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు నారా లోకేష్‌. 2022సంవత్సరంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ అధికారం టిడిపిదే కావాలన్న ఆలోచనలో లోకేష్ ఉన్నారట. 
 
చంద్రబాబు కూడా లోకేష్ సైకిల్ యాత్రను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కరోనా తగ్గుముఖం పడితేనే ఈ యాత్రను చేపట్టాలని మాత్రం బాబు లోకేష్ కు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీలోని కొంతమంది సీనియర్లందరూ కూడా లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారట.