సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వి
Last Modified: మంగళవారం, 14 జులై 2020 (20:26 IST)

కొత్త సినిమాలను ఒప్పుకోని 'దేవసేన', పెళ్లి చేసుకుంటుందా?

స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో వెండితెరకు ఆమె గుడ్ బై చెప్పనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అనుష్క కొత్త సినిమాలకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. టాలీవుడ్‌లో అనుష్క పెళ్లి గురించి పలు రకాల పుకార్లు వచ్చాయి కూడా.
 
కాగా అనుష్క త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారనీ, అందుకే గ్లామర్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఇమేజ్ చాలనీ, ఇకపై సినిమాలు చేయనని అనుష్క తన సన్నహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉన్నది.