గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (11:37 IST)

ఏపీ రైతులకు శుభవార్త.. అకౌంట్‌లోకి రూ.24వేలు

jagan
ఏపీ రైతులకు శుభవార్త. ఏపీకి చెందిన రైతన్నల అకౌంట్లలోకి శుక్రవారం రూ.24వేలు రానున్నాయి. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేతన్న నేస్తం’ పథకం కింద లబ్ధిదారులకు ఇవాళ సీఎం జగన్ నిధులు అందించనున్నారు. 80,686 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున మేర జమ చేస్తారు.
 
ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో వర్చువల్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ ఈ నగదును జమచేయనున్నారు. కాగా, ఈ పథకం ద్వారా గత నాలుగేళ్లలో నేతన్నలకు రూ.776 కోట్ల సాయం అందింది.

జూలై 21వ తేదీ ఉదయం సీఎం వైఎస్ జగన్ తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా వెంకటగిరిలోని విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తదనంతరం, ముఖ్యమంత్రి ఒక్క బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ. 24,000 ఆర్థిక సహాయం మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు.
 
‘వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం’ సంక్షేమ పథకం చేనేత కుటుంబాలకు స్థిరమైన సహాయాన్ని అందిస్తూ వారిని మరింత స్వావలంబనగా తీర్చిదిద్దుతోంది. ఈరోజు అందజేస్తున్న సాయంతో కలిపి, ‘వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం’ కింద అర్హులైన ప్రతి నేత కుటుంబానికి జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1,20,000 అందించింది.