శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (16:57 IST)

చెప్పుతో కొట్టేవాడు లేక ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.. సీబీఎన్

chandrababu
ఏపీలో వైఎస్ జగన్‌ పాలనలో 3372 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. ఆడబిడ్డల సంబంధాల గురించి వాలంటీర్లకు ఏంటి సంబంధం అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. చెప్పుతో కొట్టేవాడు లేక ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడ్డారు. 
 
నాలుగేళ్ల జగన్ పాలనలో 52,587 దాడులు, అఘాయిత్యాలు జరిగాయని చంద్రబాబు అన్నారు. 22,278 మంది మహిళలు కనిపించకుండా పోయారు. అలాగే 3372 మందిపై అత్యాచారాలు, 41 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని చంద్రబాబు అన్నారు. 
 
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లంచెర్ల రాజుపాలెంలో అటవీభూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణపరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతమవుతోందని వెల్లడించారు.