సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (08:55 IST)

ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు.. సున్నితంగా తిరస్కరించాను : పోలవరం ఎమ్మెల్యే (Video)

chirri balaraju
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున చిర్రి బాలరాజు పోటీ చేసి బలమైన వైకాపా అభ్యర్థిని చిత్తు చేశారు. ఈ విజయం వెనుక పోలవరానికి జనసైనికులు, వీరమహిళలు ఉన్నారు. నిరుపేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చిర్రి బాలరాజుకు కారు కూడా లేదు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక జనసేన నేతలు, కార్యకర్తలంతా కలిసి చందాలు వేసుకుని ఫార్చునర్ కారును కొనుగోలు చేసి తమ ఎమ్మెల్యేకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ కారును ఎమ్మెల్యే బాలరాజు సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. తనపై ఎంతో ప్రేమ, అభిమానంతో మా నియోజకవర్గ జనసేన సైనికులు ఫార్చునర్ కారును కొనుగోలు చేస బహుమతిగా ఇచ్చారని దాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. ఎందుకంటే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణతో పాటు తామంతా ఎంతో నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామన్నారు. అందువల్ల తన విన్నపాన్ని మన్నించి ఆ కారును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.