శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (15:46 IST)

విభజించు - పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న పాలకులు : పవన్ కళ్యాణ్

తమ అవసరాలకు తగినట్టుగా రాజకీయ నేతలు, పాలకులు మాట మార్చేస్తుంటారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంటే విభజించు పాలించు అనే సిద్ధాంతంతో నేతలు ముందుకు పోతున్నారన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలోనూ అదే జరిగిందన్నారు. 
 
మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో క్రియాశీల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ విభజించి పాలించే విధానంతో పాలకులు వెళ్తున్నారని, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమన్నారు. ఈ విషయంలో మరో మాటకు తావులేదన్నారు.
 
అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదన్నారు. ప్రజలు కోల్పోయిన వాటిని అందజేయడమేనని, అది జనసేన చేస్తుందన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా.. పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని విమర్శించారు. 
 
తనకు సమస్యల నుండి పారిపోవడం తెలియదని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. దేనిపైనైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు స్పష్టంగా చెబుతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.