శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (16:49 IST)

జగన్ సర్కారుపై జనసేనాని టార్గెట్.. సాధ్యమా?

జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి సిద్థమవుతున్నారు. కరోనా కారణంగా కాస్త రిలీఫ్ తీసుకున్న జనసేనాని తన ప్రకటనల ద్వారా ప్రభుత్వంపై విమర్సలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్థమవుతూ ప్రణాళికలను సిద్థం చేసుకున్నారు.
 
గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా రేపు, ఎల్లుండి జనసేన పార్టీ నాయకులతో సమావేశం జరుగనుంది. పార్టీ వ్యవస్థాపకుడితో పాటు ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈసారి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. 
 
జనసైనికులు ఆ దిశగా ముందుకు సాగాలని.. కరోనా సమయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ దిశానిర్ధేశం చేయబోతున్నారట. చాలారోజుల తరువాత పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తుండడం పార్టీ బలోపేతానికి ఇది ఎంతగానో దోహదచేస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట. అయితే సినిమాలతో పాటు రాజకీయాలపైనా జనసేనాని దృష్టి పెట్టాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.