గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (16:00 IST)

వేడెక్కిన ఏపీ పాలిటిక్స్... గంటా శ్రీనివాస రావు ఇంట్లో కాపు నేతల భేటీ!

ganta
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాపు నేతలంతా సమావేశమయ్యారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఇందులో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బోండా శ్రీనివాస రావులు పాల్గొన్నారు. మరోవైపు, గుంటూరులో బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
విజయవాడలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వీరంతా అక్కడ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నాదెండ్ల - కన్నా భేటీ, గంటా పార్టీ మార్పు ప్రచారంపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అయితే, తాను టీడీపీని వీడి వైకాపాలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. 
 
నాదెండ్లతో భేటీ జరిగిందని, తాజా రాజకీయాలపై చర్చించుకున్నామని, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. కాపు నేతల భేటీ జరిగివుంటే మాతోపాటు చాలా మంది కూర్చొనేవారు ఉన్నారన్నారు. ఈ భేటీకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.