శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 జనవరి 2025 (22:38 IST)

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

Fish Venkat
సినిమాల్లో కామెడీ విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్. ఆయన ఈమధ్య తను తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. బీపీ, షుగర్ సమస్యలతో తన కిడ్నీలు ఫెయిలయ్యాయనీ, అందుకు డయాలసిస్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. తన పరిస్థితి తెలుసుకుని ఆదుకుని, నాకు ధైర్యం చెప్పిన దేవుడు పవన్ కల్యాణ్ అని ఉద్వేగానికి లోనవుతూ చెప్పారాయన.
 
ఫిష్ వెంకట్ మాటల్లోనే..." నాకు ఈమధ్య బీపి, షుగర్ సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుంది. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయనీ, ట్రీట్మెంట్ ఖర్చు అధికంగా వుంటుందని వైద్యులు చెప్పారు. నా వద్ద అంత డబ్బు లేదు. పెద్ద హీరోల వద్దకు వెళ్లి సమస్య చెబితే సాయం చేస్తారని నా భార్య అడగమని చెప్పింది. ఐతే నాకు మనస్కరించక ఎవరి వద్దకూ వెళ్లలేదు. ఐతే పవన్ సార్ ను అడిగితే ఆయన ఖచ్చితంగా సాయం చేస్తారని నా భార్య చెప్పడంతో వెళ్లాను.
 
ఆయన షూటింగ్ బిజీలో వున్నారు. నన్ను చూసి పలుకరించి విషయం తెలుసుకుని వెంటనే రూ. 2 లక్షలు నా బ్యాంకు ఖాతాలో వేయించారు. నాకు ధైర్యం చెప్పారు. తనవంతు సాయాన్ని చేస్తానని, అధైర్య పడవద్దని అన్నారు. నా జీవితంలో ఆయన చేసిన మేలును మర్చిపోలేను. నా తల్లిదండ్రుల తర్వాత అంతటివారు పవన్ సార్. ఆయన సుఖసంతోషాలతో ఆనందంగా వుండాలి. ఆయన కుటుంబం చల్లగా వుండాలి. శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులు ఆయనకు వుండాలి'' అంటూ ఫిష్ వెంకట్ వీడియో ద్వారా తెలియజేసారు.