సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (20:11 IST)

ఖబడ్దార్ విష్ణువర్థన్ రెడ్డి : మాజీ మంత్రి జవహర్

చంద్రబాబు ఆలయాలు కూర్చుతున్నారని విష్ణువర్థన్ రెడ్డి అంటున్నారని, అప్పుడు విష్ణువర్థన్ రెడ్డి ఏ కలుగులో ఉన్నారని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ విమర్శించారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు విష్ణువర్థన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఈ మేరకు శనివారం ఓ వీడియో సందేశం పంపారు. టీడీపీ బాధ్యతగా వ్యవహరిస్తుందని, హైందవ ముసుగులో జగన్ రెడ్డి భజన విష్ణువర్థన్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. ఖబడ్దార్..నీ మాటలు ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఇష్టానుసారంగా మట్లాడితే ప్రజలు శిక్ష వేస్తారని, ఏ ప్రయోజనం ద్వారా చంద్రబాబును విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.

హైందర రక్షకుడిగా జగన్..ఆలయాలు కూల్చేవాడిలా చంద్రబాబు మీకు కనబడుతున్నారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను కాపాడింది టీడీపీనే అన్ని మతాలను గౌరవించేది ఒక్క టీడీపీనే అన్న మాట గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.