ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 19 ఆగస్టు 2021 (18:15 IST)

తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ ని క‌లిసిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

అన్న‌ట్లుగానే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇంటికి తేనీటి విందుకు వెళ్ళారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి. కుటుంబ స‌మేతంగా ఆయ‌న జ‌గ‌న్ ఇంటికి వెళ్లారు. జ‌గ‌న్ దంప‌తులు వారి కుటుంబాన్ని ఘ‌నంగా స్వాగ‌తించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులను సీఎం వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి రెడ్డి దంపతులు సన్మానించారు.

కిషన్‌రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు వారిని ఆప్యాయంగా ప‌ల‌కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కూడా ఉన్నారు.