Festival Posters

భార్యపై అనుమానం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు.. కానీ షాక్?

Written By సెల్వి
Updated: గురువారం, 9 జులై 2020 (15:01 IST)
భార్యపై అనుమానం పెంచుకున్న కానిస్టేబుల్‌కి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... భార్యకు వేరొక వ్యక్తితో సంబంధం వుందని కానిస్టేబుల్‌కు అనుమానం ఏర్పడింది. అంతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో భార్య స్థానంలో ఆమె సోదరి వేరొక వ్యక్తితో గదిలో వుండటాన్ని చూసి షాకయ్యాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలోని మైలవరంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మైలవరంలో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ భార్య.. స్థానిక నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సదరు భర్త అనుమానం పెంచుకున్నాడు. పొందుగల రోడ్డులో ఉన్న నాయకుడి ఇంటికి భార్య రహస్యంగా వెళ్లి కలుస్తున్నట్లు కానిస్టేబుల్ భావించాడు. దీంతో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. 
 
ఈ క్రమంలో నిఘా పెట్టిన కానిస్టేబుల్.. ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ఉన్న సమయంలో నాయకుడి ఇంటి గడియ పెట్టాడు. ఇక పోలీసులను, మీడియాను అక్కడికి పిలిచాడు. తీరా గడియ తీసేసరికి.. లోపల్నుంచి భార్య స్థానంలో ఆమె అక్క వచ్చింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments