శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (09:23 IST)

ప్రారంభమైన ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంతిమయాత్ర

రెండు రోజుల క్రితం హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంతిమ యాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన అంత్యక్రియలు ఉదయగిరిలోని మెరిట్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. ఇందుకోసం మంత్రి భౌతికకాయాన్ని నెల్లూరు నుంచి తరలించారు. ఈ అంతిమయాత్ర నెల్లూరు, జొన్నవాడ, సంగం, వాసిలి, నెల్లూరు పాళె, డీసీపల్లి, మర్రిపాడు, బ్రహ్మణపల్లి మీదుగా ఉదయగిరిగి చేరుకుకుంటుంది. 
 
ఉదయగిరిలో జరిగే అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ అంతిమ యాత్ర వెంట ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గోవర్థన్ రెడ్డి, సంజీవయ్యలు ఉన్నారు.