గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (14:32 IST)

రేపు నామినేషన్ దాఖలు చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి

mekapati vikram reddy
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో మాజీమంత్రి మేకపాటి గౌతంరెడ్డి వారసుడుగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. 
 
రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. దీంతో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డికి వైకాపా అధినేత, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయించారు. దీంతో ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్రమంత్రులు, వైకాపా నేతలు పాల్గొనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పోటీకి ప్రధానప్రతిపక్షమైన టీడీపీ దూరంగా ఉన్న విషయం తెల్సిందే.