Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగ‌రాయుళ్ల‌ను దోచుకుంటున్న వ్యాపారులు

Written By ఎం
Updated: సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:07 IST)
'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్'.. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర పలికిన ఈ పదాలు ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటాయి.

ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... పొగతాగని వాడు దున్నపోతుగా పుడతారో లేదో తెలియదు కానీ... పొగ తాగే వాళ్ళు జేబులు మాత్రం వ్యాపారులు దోచుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తుల రవాణా ఆగిపోవడంతో గోడౌన్లలో ఉన్న సరుకు ధర అమాంతం పెరిగిపోయింది.

సాధారణంగా ఉండే 2 శాతం మార్జిన్ 20 శాతానికి పెరిగింది. పొగాకు ఉత్పత్తులు నిత్యావసరాలు కాకపోవడంతో వాణిజ్య శాఖ అధికారులు వీరిపై ఎటువంటి దాడులు నిర్వహించరు. వాస్తవంగా ఈ బ్లాక్ మార్కెట్ ను నిరోధించేందుకు ఈ శాఖ అధికారులకు అవకాశం ఉంది.

కానీ వ్యాపారులు ఇస్తున్న ముడుపుల కు ఈ అధికారులు లొంగి పోయారని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం కూడా వ్యాపారుల వ్యవహార శైలి కూడా ఓ ప్రధాన కారణం.

ధరలు పెంచి అమ్ముతున్న పొగాకు ఉత్పత్తులపై వినియోగదారులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగిన సమయంలో వారే ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా పొగతాగే అలవాటు ఉన్నవారు దానిని మానుకోలేరు.

ఒకవేళ మానేందుకు ప్రయత్నిస్తే మానసిక రోగిగా తయారవుతారు. ఈ బలహీనత అడ్డం పెట్టుకొని వ్యాపారులు చేస్తున్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పొగాకు ఉత్పత్తుల వినియోగదారులు కోరుకుంటున్నారు.

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments