గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (21:54 IST)

బండారు సత్యనారాయణపై సుప్రీంలో కేసు.. మంత్రి రోజా

rk roja
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన దారుణ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ఏపీ మంత్రి రోజా చెప్పారు. బండారు లాంటి చీడపురుగులను ఏరివేయాల్సిన అవసరం ఉందని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండారు వ్యాఖ్యల వల్ల తన కుటుంబం చాలా అవమానపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేనలు ఉన్నది దిగజారుడు రాజకీయాలు చేసేందుకేనని చెప్పారు.
 
మహిళలను ఒక్క మాట అనాలన్నా భయపడే పరిస్థితి రావాలని చెప్పారు. ఒక మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడటం ఊహ తెలిసినప్పటి నుంచి తనకు తెలియదన్నారు. బండారు వంటి వ్యక్తికు బుద్ధి చెప్పేందుకు తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఒకవేళ అరెస్టయి, బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేయనట్టు కాదని రోజా అన్నారు.