శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:50 IST)

ఏపీ విద్యా మంత్రి సురేష్ అక్రమాస్తుల కేసు : తీర్పు రిజర్వు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసు కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. మంత్రి సురేశ్‌ దంపతులపై సీబీఐ గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఉత్తర్వులిచ్చింది. 
 
అయితే, ఈ ఉత్తర్వులను సుప్రీంలో సీబీఐ సవాలు చేసింది. ఇప్పటికే 111 మంది సాక్షులను విచారించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో 3 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని వివరించింది. ఛార్జిషీట్‌ దాఖలు తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సురేశ్‌ దంపతులు స్పందిస్తూ కక్ష సాధింపునకే సీబీఐ విచారణ చేపట్టిందన్నారు.