గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (11:31 IST)

మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ ఇకలేరు

మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ మాంటిస్సోరి పాఠశాలలు, ఇంటర్ డిగ్రీ కళాశాలల ద్వారా లక్షలాది మందికి విద్యాదానం, స్త్రీ విద్య, సమాజ నిర్మాణం, మహిళా సాధికారత కోసం కృషి చేశారు. 
 
కోటేశ్వరమ్మ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ 1955లో మాంటిస్సోరి పాఠశాల స్థాపించారు. కేవలం విద్యార్ధినుల కోసమే ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేశారు. మాంటిస్సోరి విద్యా విధానంలో నర్సరీ నుంచి పీజీ వరకు, సాంకేతిక విద్యా విధానంలో బీఈడి, ఫార్మసీ, లా, ఇంజనీరింగ్ విద్యా సంస్థల మందులకి మహిళలను విద్యావంతులను చేసేందుకు ఎనలేని కృషి చేశారు. 
 
మాంటిస్సోరి విద్యాసంస్థలలో మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి, మాజీ ఎంపీ మాగంటిబాబు, ఐ.ఎ.యస్ అధికారి ఉషాకుమారి, డాక్టర్ రమేష్ తదితరులు విద్యను అభ్యసించారు. 1925లో జన్మించిన కోటేశ్వరమ్మ 92 ఏళ్ల వయసులో పద్మ పురస్కారం అందుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు అవార్డులు సాధించారు.