శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (10:03 IST)

నంద్యాల కౌంటింగ్ : 4 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ మెజార్టీ 9653

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపు చూస్తుంటే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి (టీడీపీ) విజయం సాధించడం ఖాయంగా తెలుస్తోంది. ఓట్ల లెక్కింపులో

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపు చూస్తుంటే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి (టీడీపీ) విజయం సాధించడం ఖాయంగా తెలుస్తోంది. ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి తొలి రౌండ్ నుంచే ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. 
 
సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా, ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ నాలుగు రౌండ్లలో టీడీపీ అభ్యర్థే ఆధిక్యాన్ని సాధించారు. తొలి మూడు రౌండ్‌లతో పోలీస్తే.. ఈ రౌండ్‌లో ఆధిక్యం భారీగా వచ్చింది. నాలుగో రౌండ్‌‌లో 3600 ఓట్ల ఆధిక్యంతో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. టీడీపీ మొత్తం ఓట్లు 9653 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతుంది. 
 
నాలుగు రౌండ్లు ముగిసేసరికి టీడీపీ: 17,697, వైసీపీ: 11,624, కాంగ్రెస్: 211 ఓట్లతో లెక్కింపు కొనసాగుతోంది.
 
మొదటి రౌండ్‌‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5474 ఓట్లు పోలవగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 4179 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీడీపీ 1295 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
 
రెండో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 4726 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3945 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్‌లో టీడీపీ 1634 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
 
మూడో రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 7058 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 3126 పోలయ్యాయి. దీంతో రెండో రౌండ్‌లో టీడీపీ 3,113 ఓట్ల ఆధిక్యంలో ఉంది.