సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2019 (15:38 IST)

గోదావరిలో గల్లంతైనవారికోసం గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటు బోల్తా

గోదావరి ఉగ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. పడవ పైన ఎవరయినా గోదావరిలోకి వెళితే బొల్తా కొడుతున్నారు. పాపికొండల నడుమ గోదావరిలో పడవ బోల్తా ఘటన మర్చిపోక ముందే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. 
 
ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గల్లంతైన 14 మంది ఆచూకి ఇప్పటికీ లేకపోవడంతో వారంతా బోటులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి వుంటారేమనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గోదావరిలో వెతుకుతూ వున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా కొట్టింది. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఐతే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చాకచక్యంగా బోటును తిరిగి మామూలు స్థితికి తెచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.