ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (13:58 IST)

అవినీతి ఎమ్మెల్యే మాకొద్దు - సమన్వయకర్త ముద్దు - వైకాపా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు

corruption mla
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజగవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం సాగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ "అవినీతి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాకొద్దు.. సమన్వయకర్త ముద్దు" అంటూ ముద్రించిన కరపత్రాలు ముద్రించారు. ఇవి గ్రామంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో పదుల సంఖ్యలో లభించాయి. 
 
గుర్తుతెలియని వ్యక్తులు వీటిని ముద్రించి పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలుగుచూడటంతో సంతనూతలపాడు నియోజకవర్గ వైకాపాలో కలకలం రేగింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇట్లు సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ పార్టీ కార్యకర్తల పేరుతో ముద్రించి ఉన్న ఈ కరపత్రాల వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందనే విషయం చర్చనీయాంశంగా మారింది.