1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (16:59 IST)

సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలులో ప్రయాణ చార్జీ ఎంత? (video)

Bharat Express
ఈ నెల 9వ తేదీ నుంచి సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు ఎంతో అనుకూలంగా ఉండనుంది. మొత్తం 662 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని కేవలం 8.30 గంటల్లోనే చేరుకోనుంది. ఏప్రిల్ 9వ తేదీన తిరుపతి నుంచి, పదో తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరుతుంది. 
 
నిజానికి 8వ తేదీన సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభిస్తారు. కానీ, ఆ రోజున రైలులో ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతించరు. ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు అదే రోజు రాత్రి 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఒక్క మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ రైలు ప్రయాణ చార్జీలను రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. 
 
మరోవైపు, ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ మార్గంలో నల్గొండకు ఉదయం 7.19 గంటలకు గుంటూరు జంక్షన్‌కు ఉదయం 9.45 గంటలకు, ఒంగోలుకు 11.09 గంటలకు నెల్లూరుకు 12.29 గంటలకు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో తిరుపతిలో సాయంత్రం 3.15 గంటలకు బయలుదేరి నెల్లూరుకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఒంగోలుకు కార్తి 6.30 గంటలకు, గంటూరుకు రాత్రి 7.45 గంటలకు, నల్గొండకు రాత్రి 10.10 గంటలకు, సికింద్రాబాద్‌కు రాత్రి 11.45 గంటలకు చేరుకుంది. 
 
ఈ స్టేషన్ల మధ్యే ఈ రైలు ఆగుతుంది. అయితే, నెల్లూరు - తిరుపతి ప్రాంతాల మధ్య గూడూరు జంక్షన్ ఉంది. దీంతో ఈ రైల్వే స్టేషన్‌లో కూడా వందే భారత్ రైలును ఆపాలని స్థానిక ప్రజలు కోరుతుంటారు. ఎందుకంటే. దూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు ఈ స్టేషన్‌లో దిగి, ఇక్కడ నుంచి మరో రైలులో వెళుతుంటారు. ఇలాంటివారితో స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును గూడూరు జంక్షన్‌లో ఆపాలని వారు కోరుతున్నారు. 
 
మరోవైపు, ఈ రైలులో ప్రయాణ చార్జీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 11 లేదా 12 గంటల పాటు ఉంటుంది. ఈ వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం 9 గంటలు మాత్రమే.. అంటే మూడు గంటల సమయం ఆదా కానుంది.